నాని - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి చిత్రం 'జెంటిల్‌మ‌న్‌'

  • IndiaGlitz, [Friday,April 15 2016]

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి 'జెంటిల్‌మ‌న్‌' అనే పేరు పెట్టారు. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ''మా సంస్థ‌లో నాని హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా సినిమాకు 'జెంటిల్‌మ‌న్' అనే పేరును ఖరారు చేశాం. ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే అంశాలుంటాయి. ఆహ్లాద‌క‌ర‌మైన‌ రొమాన్స్, సెంటిమెంట్, వినోదం త‌గిన మోతాదులో క‌ల‌గ‌లిసి ఉంటాయి. చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌ణిశ‌ర్మ మంచి సంగీతాన్నిచ్చారు. పాట‌ల విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం'' అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

More News

చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి, అల్లు అర‌వింద్ స‌మ‌క్షంలో ఘ‌నంగా సుప్రీమ్ ఆడియో విడుద‌ల‌

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ - రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

స‌రైనోడు సినిమాలో హైలైట్ ఇదే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా గోపీచంద్ 'ఆక్సిజన్' ఫస్ట్ లుక్ విడుదల

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం  'ఆక్సిజన్‌'. శ్రీరామనవమి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

పెళ్లి ఫిక్సైన ప్రొడ్యూస‌ర్ కూతురు - డైరెక్ట‌ర్ జంప్..

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన యువ ద‌ర్శ‌కుడు, పెళ్లి ఫిక్స్ అయిన ప్రొడ్యూస‌ర్ కూతురు క‌లిసి పారిపోయారు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఆ నిర్మాత కూతురు ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా..?

చైతు - అఖిల్ సినిమాల‌పై మ‌న‌సు పెట్ట‌లేద‌న్న నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌నం, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.