close
Choose your channels

అక్కడ షూట్ చేయడం ఫస్ట్ టైం.. చాలా ఎంజాయ్ చేశాం: అనుష్క

Wednesday, September 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కడ షూట్ చేయడం ఫస్ట్ టైం.. చాలా ఎంజాయ్ చేశాం: అనుష్క

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల కాబోతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనుష్క మంగళవారం జూమ్‌ వీడియో ద్వారా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.

యుఎస్‌లో అద్భుతమైన లోకేషన్స్‌లో ‘నిశ్శబ్దం’ చిత్రీకరణ జరిపామని... తాను నటించిన సినిమా మొత్తం యుఎస్‌లో షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని అనుష్క తెలిపింది. చాలా ఎంజాయ్ చేశామని వెల్లడించింది. షూటింగ్ మొత్తం చాలా త్వరగా పూర్తైందని వెల్లడించింది. అమెరికా క్రూ కూడా ఉన్నారని... మంచి అనుభవమని పేర్కొంది. మనవాళ్లతో, అమెరికా క్రూతో కలిసి నటించడం సంతోషంగా అనిపించిందని అనుష్క తెలిపింది. అయితే నిశ్శబ్దం సినిమా రిలీజ్ వాయిదా పడడానికి కారణం ఉందని... అన్ని లాంగ్వేజేస్‌లో ఒకేసారి రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేశామని తెలిపింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని అనుష్క పేర్కొంది. ఇక సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్, గిరీష్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ ప్లస్ అవుతుందని తెలిపింది. డిఫరెంట్ స్ర్కిన్ ప్లేని విజువలైజ్ చేసుకుని మ్యూజిక్ అందించారని అనుష్క వెల్లడించింది. విజువల్స్‌తో పాటు సౌండ్ కూడా సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని పేర్కొంది. అది థియేటర్‌లో అయితే అందరూ ఎంతో ఎంజాయ్‌ చేసేవారని... కానీ పరిస్థితులు అనుకూలించలేదని అనుష్క వెల్లడించింది.

అక్కడ షూట్ చేయడం ఫస్ట్ టైం.. చాలా ఎంజాయ్ చేశాం: అనుష్క

ఓటీటీనే బెస్ట్ ఆప్షన్..

కోవిడ్ 19 కారణంగా సినిమా ఇండస్ట్రీయే కాదు... ప్రపంచమంతా ఇబ్బంది పడింది. ఇలాంటి సమయంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్. నా వరకు మాత్రం థియేటర్స్‌లో సినిమా చూడడమే ఇష్టపడతాను. ఓటీటీ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో పాన్ ఇండియా మూవీస్ కూడా ఓటీటీలో వచ్చేస్తాయి. భవిష్యత్తులో ఓటీటీ యూజ్‌ మరింతగా పెరుగుతుంది. బాహుబలి అన్ని దేశాల్లో ఎలా రిలీజ్ అయ్యిందో.. ఇప్పుడు ఓటీటీల ద్వారా కూడా ప్రతి సినిమా అన్ని దేశాలకు చేరుతుంది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.