Kommu Konam Fish: వలలో చిక్కిన అరుదైన చేపలు.. కోటీశ్వరులైన ఇద్దరు జాలర్లు

  • IndiaGlitz, [Saturday,June 25 2022]

కొంతమందికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది. కొందరు జాలర్ల విషయంలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. పూట గడిచేందుకు సైతం అష్టకష్టాలు పడ్డ వేళ.. వలలో అరుదైన చేపలు పడటం అవి కోట్లు పలకడం వంటి ఘటను మనం ఎన్నోసార్లు పేపర్లలో చూశాం. తాజాగా కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు మత్య్సకారులను అదృష్ట దేవత తలుపు తట్టింది.

13 టన్నుల అరుదైన చేపలు:

వివరాల్లోకి వెళితే.. కాకినాడ, యూ కొమ్ముపల్లి మండలం, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో విసిరిన వలలను పైకి తీసి చూడగా అవాక్కయ్యారు. బంగాళాఖాతంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన కొమ్ముకోనం చేపలు వారి వలలో పడ్డాయి. ఏదో ఒకటి రెండు కాదు.. ఏకంగా 13 టన్నుల చేపలు వలలో పడ్డాయి. వాటిని ఒక్క బోటుతో తరలించటం వారి వల్ల కాలేదు. దీంతో మరో రెండు బోటులను రంగంలోకి దింపారు.

కోటి 20 లక్షలకు వేలం:

రెండు బోటుల్లో చేపల్ని నింపుకుని ఒడ్డుకు చేరారు. ఈ చేపల్ని వేలం వేయగా భారీ ధర పలికాయి. ఏకంగా కోటి 20లక్షల రూపాయలకు వీటిని కొనుగోలు చేశారు వ్యాపారులు. దీంతో మత్స్యకారుల సంతోషానికి హద్దులు లేకుండాపోయింది. సాధారణంగా ఈ చేపలు సముద్రంలో వందల అడుగుల లోతులో సంచరిస్తూ వుంటాయి. ఈ కొమ్ముకోనెం చేపలకు బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో భారీ డిమాండ్‌ ఉంది.

More News

Janasena : సమీక్షా సమావేశాలతో పవన్ బిజిబిజీ.. ఏపీ, తెలంగాణ నేతలతో వరుస భేటీలు, ఎన్నికలపై దిశానిర్దేశం

ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుండటంతో జనసేన అధినేత పపన్ కల్యాణ్ యాక్టీవ్ అయ్యారు.

Janasena : జనసేన మహిళా నేతకు అర్థరాత్రి పూట ఫోన్లు, బాలినేని గారూ.. ఇది కరెక్ట్ కాదు : పవన్ ఆగ్రహం

తమ పార్టీ అధికార ప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Nandamuri Balakrishna: కరోనా బారినపడ్డ నందమూరి బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కి జాగ్రత్తలు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌, ఇతర చర్యలు చేపట్టి థర్డ్ వేవ్‌ను సులభంగానే తప్పించుకున్నప్పటికీ భారత్‌లో

Chintamani Natakam : రఘురామకు చుక్కెదురు.. ‘‘ చింతామణి ’’పై ఏపీ సర్కార్ నిషేధం, స్టేకు హైకోర్టు నో

తెలుగు ప్రజల ఆల్‌టైమ్ ఫేవరేట్ నాటకాల్లో ఒకటైన చింతామణి నాటకంపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Janasena: ‘‘ దుల్హన్’’ నిలిపివేత.. ముస్లింలను ముంచారు, జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: జనసేన నేతల ఆగ్రహం

ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్.