close
Choose your channels

గ్రేటర్‌లో ‘గులాబీ’ ప్రవాహానికి ‘వరద’ గండికొట్టనుందా?

Sunday, October 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్రేటర్‌లో ‘గులాబీ’ ప్రవాహానికి ‘వరద’ గండికొట్టనుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారినప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా.. టీఆర్ఎస్‌కు సీట్ల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ప్రయత్నించినా టీఆర్ఎస్ ఓట్ల ప్రవాహాన్ని కానీ.. సీట్ల ప్రవాహాన్ని కానీ అడ్డుకోలేకపోతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక వరకూ దాదాపు ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతూనే ఉంది. ఇక త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు సెంచరీని నమోదు చేసింది. కానీ ఈ సారి ఆ స్థాయి హవా ఉంటుందా? అసలు గెలుపు గుర్రాన్ని సొంతం చేసుకోగలుగుతుందా? అనేది బిగ్ క్వశ్చన్.

టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుపొందుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవడానికి కారణం.. హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు. ప్రతి ఏరియాలో ఎంతో కొంత భాగం ఎఫెక్ట్ అయింది. ఇక పాతబస్తీ అయితే చెప్పనక్కర్లేదు. కుటుంబాలకు కుటుంబాలే కొట్టుకుపోయాయి. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఏ ఏరియాకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర ప్రతికూలత ఎదురవుతోంది. పలు చోట్ల స్థానికులు పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ కార్పోరేట్లపై దాడికి పాల్పడుతున్నారు. ఇక అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలను.. మంత్రులను సైతం అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే.. ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగగలరా? అనేది పెద్ద ప్రశ్న.

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీపై ‘వరద’ భారీగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. పోనీ ఎన్నికలకు ఒక నెల సమయం ఉంది కాబట్టి బతుకమ్మ చీరలకు ఆశపడి మహిళలు ఓటేస్తారనుకుంటే.. ఇటీవల బతుకమ్మ చీరల గురించి విడుదలైన ఓ వీడియో అవి ఏమాత్రం ప్రభావం చూపలేవనిపిస్తోంది. బతుకమ్మ చీరను రూ.100కు కూడా ఎవరూ కొనరని.. అవి గతేడాదివని ప్రభుత్వ సిబ్బంది బతుకమ్మ చీరల కట్టలను చూస్తూ మాట్లాడుకున్న వీడియోను మెయిన్ స్ట్రీమ్ మీడియాయే కాకుండా సోషల్ మీడియా కూడా బాగా కవర్ చేసింది. ఆ వీడియో టీఆర్ఎస్‌కు చాలా పెద్ద దెబ్బ. అయితే ఈ పరిణామాలన్నీ ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశాలే. ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోగలిగితే తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోవచ్చు. మరి ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలన్నింటినీ క్యాష్ చేసుకోగలవో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.