ప్లాప్ డైరెక్టర్ తో వెంకటేష్ అసురన్?

  • IndiaGlitz, [Saturday,November 16 2019]

‘ఎఫ్‌2’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో వెంకటేశ్‌ దాని తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘అసురన్‌' రీమేక్‌లో వెంకటేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో ఈ సినిమా ధనుష్‌, మంజు వారియర్‌ జంటగా తెరకెక్కింది. ఈ సినిమా రీమేక్‌ని ఎవరు డైరెక్ట్‌ చేస్తారనే విషయంలో కొంత తర్జనభర్జన జరిగింది.

ఇటీవల హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు ఆ అవకాశం శ్రీకాంత్‌ అడ్డాలను వరించిందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన శ్రియా శరన్‌ హీరోయిన్‌గా నటిస్తుందంటున్నారు. ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ సంస్థల్లో సురేష్‌ బాబు, కళైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్‌ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

ప్రస్తుతం వెంకటేష్‌ ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేశ్‌, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ను కె.ఎస్‌.రవీంద్ర డైరెక్ట్‌ చేస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌ 13న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటునారు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

More News

'భాస్కర్ ఒక రాస్కెల్' టీజర్ ఆవిష్కరణ

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో....సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ముఖ్య పాత్రలో సిద్ధికీ దర్శకత్వంలో తమిళంలో

ప్రభాస్‌ జాన్ కోసం భారీ సెట్‌

‘బాహుబలి’తో ప్రభాస్‌ హీరో  రేంజ్‌ అమాంతం పెరిగింది.  లోకల్‌ స్టార్‌ కాస్త నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు.

నవంబర్‌ 23న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ?

సూపర్‌స్టార్‌ మహేశ్‌ 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది.

'అమ్మ‌దీవెన' ఫస్ట్ లుక్ విడుదల

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో

అచ్చెన్నా.. మంత్రి రాజీనామాకు రెడీ.. మరి మీరు..!?

‘ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. అంతేకాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను’