ప‌వ‌ర్‌స్టార్ కోసం జాన‌ప‌ద రైట‌ర్‌..!

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’ రీమేక్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు ప‌వ‌న్‌. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పీడు చూసి ఇత‌ర స్టార్స్ అంద‌రూ స్ట‌న్ అయిపోతున్నారు. ఎందుకంటే కోవిడ్ ప్ర‌భావంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్స్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ‘వ‌కీల్ సాబ్’‌ను పూర్తి చేసిన ప‌వ‌న్‌, ఇప్పుడు ఈ రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు.

మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’ రీమేక్ విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేను అందిస్తుండ‌గా, అయితే మాట‌ల‌ను త్రివిక్ర‌మ్ అందించ‌డం లేద‌ట‌. ఈ మ‌ధ్య కాలంలో పాట‌లు రాస్తూ, పాడుతూ మెప్పించిన జాన‌ప‌ద రైట‌ర్ పెంచ‌ల‌దాస్ .. ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం శ్రీశైలం ద‌గ్గ‌ర ఓ పోలీస్ స్టేష‌న్ సెట్‌, గిరిజ‌న‌వాడ సెట్ సిద్ధం చేశారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు ఉన్నార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సాయిప‌ల్ల‌వి చెల్లెలు..!

డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్‌గా మారిన వారిలో సాయిప‌ల్ల‌వి ఒక‌టి. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి.

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆస్కార్ రేసు నుంచి సూర్య ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ..ఔట్‌

ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ రేసులో సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’కి నిరాశే మిగిలింది. ఇటీవల 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366

సోష‌ల్ మీడియాకు షాకిచ్చిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌

ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు ఆమిర్‌ఖాన్‌. ఈయ‌న పుట్టిన‌రోజు మార్చి 14. ఫ్యాన్స్‌, సెల‌బ్రిటీలంద‌రూ ఆమిర్‌ఖాన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను