ఇండియన్ స్క్రీన్‌పై చరిత్రలో తొలిసారి – ‘గేమ్ ఆఫ్ చేంజ్’ మే 14న రిలీజ్!


Send us your feedback to audioarticles@vaarta.com


నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంగా 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య భారతదేశంలో జరిగిన నిజ జీవిత ఆధారిత చరిత్రలో రాని కథలతో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ ఆఫ్ చేంజ్’ మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా కలిసి నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది.
దర్శకుడు సిధిన్ మాట్లాడుతూ... “ఈ సినిమాలో సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. గేమ్ ఆఫ్ చేంజ్ అనేది ఒక శక్తివంతమైన జీవన మార్గాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం. నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంగా జరిగిన అనేక నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది,” అన్నారు.
నిర్మాత సిద్ధార్థ్ రాజశేఖర్ మాట్లాడుతూ... “2018లో ‘ఇంటర్నెట్ లైఫ్‌స్టైల్ హబ్’ ప్రారంభించి ఇప్పటివరకు 30,000 మందికి డిజిటల్ కోచింగ్ అందించాను. నేను రచించిన You Can Coach అనే ఇంగ్లీష్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు సాధించింది. సినిమా పట్ల ఉన్న మక్కువతో ఇప్పుడు నిర్మాతగా, నటుడిగా గేమ్ ఆఫ్ చేంజ్ చిత్రాన్ని రూపొందించాను,” అన్నారు.
నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ, “ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం మేం చేసాం. ఇటీవలే సంచలనం సృష్టించిన చావా సినిమాలో కూడా చాలామందికి తెలియని శంభాజీ మహారాజ్ జీవితకథను చూపించాం. ఇప్పుడు గేమ్ ఆఫ్ చేంజ్ కూడా అలాంటి ఎన్నడూ చూడని కథాంశంతో వస్తోంది. ఇది దేశభక్తిని ఉప్పొంగించే చిత్రం. చిన్నాపెద్దలందరికీ స్పూర్తిదాయకంగా ఉంటుంది,” అన్నారు.
మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల
భారతదేశ చరిత్రలో ఎన్నడూ తెరపై కనిపించని అసాధారణ కథలతో రూపొందిన గేమ్ ఆఫ్ చేంజ్ చిత్రం మే 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రేక్షకులు అన్ని భాషల్లో ఈ విభిన్న చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com