రవితేజ కోసం..

  • IndiaGlitz, [Friday,October 16 2015]

కొంద‌రికి కొన్ని టైటిల్స్ భ‌లేగా మ్యాచ్ అవుతాయి. బొద్దుగుమ్మ రాశీ ఖ‌న్నాకి కూడా అంతే. ఆమె రెండో చిత్రం 'జోరు' ఏమంటు చేసిందో.. అందులోని టైటిల్ సాంగ్ ఏమంటు పాడిందో గానీ.. ఆ త‌రువాత కెరీర్‌లో జోరు బాగానే పెరిగింది. క‌ట్ చేస్తే.. ఈ ఏడాదిలో గోపీచంద్‌తో 'జిల్‌', రామ్‌తో 'శివ‌మ్‌'.. అతి త్వ‌ర‌లో ర‌వితేజ‌తో 'బెంగాల్ టైగ‌ర్‌'.. ఇలా ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేసేసింది ఈ 'ఊహ‌లు గుస‌గుస‌లాడే' క‌థానాయిక‌.

జిల్‌, శివ‌మ్ కోసం సోలో హీరోయిన్‌గా సంద‌డి చేసిన రాశీ.. బెంగాల్ టైగ‌ర్ కోసం మాత్రం త‌మ‌న్నాతో పాటు మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మొత్త‌మ్మీద ర‌వితేజ‌లాంటి అగ్ర క‌థానాయ‌కుడు కోసం.. ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని రెండో నాయిక వేషాన్ని సైతం వేసింది రాశీ. సోలో హీరోయిన్‌గా గ‌త రెండు చిత్రాల ప‌రంగా ద‌క్క‌ని హిట్‌.. సెకండ్ హీరోయిన్‌గానైనా రాశీకి దక్కుతుందేమో చూడాలి.

More News

గురువు ఇవ్వలేనిది..శిష్యుడు ఇవ్వగలడా?

కొందరు ఫలితాల కంటే ప్రతిభకే పట్టం కడతారు.అలాంటి వారిలో నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఒకరు.

తమన్నా ఫట్... మరి కాజల్ మాటేమిటి?

ఒక్కో హీరోయిన్ కి ఒక్కో వింత పరిస్థితి ఉంటుంది.మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా అలాంటి సిట్యుయేషన్ ఒకటి ఎదురైంది.

పవన్ కళ్యాణ్ కిదే తొలిసారి

తెలుగు సినీ పరిశ్రమలో ఓ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది.అదేమిటంటే..మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులకు రెండో సినిమాలతో అదే మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టమని.

అతను లేకుండా రకుల్ సినిమాల్లేవ్

టాలీవుడ్ లో బాణంలా దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.ఓ వైపు యూత్ హీరోలతో నటిస్తూనే..

'సైజ్ జీరో' రిలీజ్ డేట్...

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం 'సైజ్ జీరో'.ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .