టైటిల్ రిజిష్టర్ చేసిందిఅందుకేనా...?

  • IndiaGlitz, [Tuesday,April 04 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపొంద‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇది నిజ‌మైతే అభిమానుల‌కు పండ‌గే. గ‌తంలో వీరిద్దరూ క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ 'ఎవ‌డు' తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చ‌ర‌ణ్‌, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. బ‌న్ని, వ‌క్కంతం వంశీ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌ర్వాతే క్రేజీ కాంబో సినిమా సెట్స్‌లోకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌ట‌. ఓ స్టార్ డైరెక్ట‌ర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని వినికిడి. అందుకే గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌ర్‌పై చ‌ర‌ణ్ అర్జున్ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించాడు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే

More News

బాలయ్య కోసం భారీ సెట్..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

తనపై వస్తున్న విమర్శలకు కీరవాణి ట్వీట్స్

బాహుబలి ప్రి రిలీజ్ వేడుకలో తెలుగుపాట అంపశయ్యపై ఉందని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు.

క్రెడిట్ అంతా మణిరత్నంగారికే దక్కతుంది - అదితిరావు హైదరీ

కార్తీ, అదితిరావు హైదరీ జంటగా నటించిన ఇంటెన్స్ ఎమోషనల్ లవ్స్టోరీ `చెలియా`. దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది.

'చెలియా' వంటి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయడం పెద్ద ఛాలెంజ్ - కార్తీ

కార్తీ, అదితిరావు హైదరీ జంటగా దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో కార్తీతో ఇంటర్వ్యూ...

తమిళ నిర్మాతల మండిలిలో విశాల్ టీం హవా

నడిగర్ సంఘంలో తనదైన సత్తా చాటిన విశాల్ అండ్ టీం రీసెంట్గా జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన విశాల్ ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.