ఫోర్బ్స్ టాప్ 100 .. మ‌హేష్‌ను క్రాస్ చేసిన ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

ప్ర‌ముఖ ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ 2019 సంవ‌త్స‌రానికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో అత్యంత ప్ర‌భావంతమైన టాప్ 100 లిస్టుల‌ను విడుద‌ల చేసింది. ఇందులో కేవ‌లం వారి ఆదాయాన్నే కాకుండా వారికున్న క్రేజ్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఈ లిస్టులో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్(రూ.35కోట్లతో) 44వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్(రూ.35 కోట్ల‌తో) 54వ స్థానం ద‌క్కించుకున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ (రూ.21.5కోట్ల‌తో) 77వ స్థానంలో నిలిచారు. గ‌త ఏడాది ఫోర్బ్స్ లిస్టులోనే లేని ప్ర‌భాస్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ని దాటేశారు. మ‌హేష్ గ‌త ఏడాది 34వ స్థానంలో నిలవ‌గా..ఈ ఏడాది 44వ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. ఈ రంగంలో టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి(రూ.252.72 కోట్ల‌తో) అగ్ర‌స్థానంలో నిలిచారు. గ‌త ఏడాది రెండో స్థానంలో నిలిచిన స‌ల్మాన్‌ఖాన్(రూ. 229.25 కోట్ల‌తో) మూడో స్థానంలో నిల‌వ‌గా అక్ష‌య్ కుమార్(రూ. 293.25 కోట్ల‌తో) రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నారు. బిగ్ బి అమితాబ్(రూ.239.25కోట్ల‌తో) నాలుగో స్థానంతో స‌రి పెట్టుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా ప‌దుకొనె 8వ స్థానంలో నిల‌వ‌గా.. ఆలియా భ‌ట్ 10వ స్థానంలో నిలిచారు. ఈ సెల‌బ్రిటీల ఆదాయం ఈ ఏడాది 22 శాతం పెరిగిన‌ట్లు ఫోర్బ్స్ వెల్ల‌డించింది.

More News

'రాఘవ రెడ్డి'గా రానున్న శివ కంఠమనేని

'అక్కడొకటుంటాడు' ఫేమ్ శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న చిత్రానికి 'రాఘవ రెడ్డి' టైటిల్ ఖరారు చేశారు.

మరిది కోసం వదినమ్మ.. ఈసారైనా అదృష్టం వరించేనా..?

సిసింద్రీగా టాలీవుడ్‌కి పరిచయమైనా... హీరోగా మాత్రం అనుకున్నంత స్థాయిలో అఖిల్ రాణించలేకపోతున్నాడు.

పాన్ ఇండియా మూవీ.. గీతా ఆర్ట్స్‌తో కలిసి మహేశ్ ప్లాన్

బాహుబలి ప్రభంజనంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఓవర్సీస్‌లో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.

'దొంగ‌' చిత్రంలో నా పాత్ర డిఫ‌రెంట్ గా ఉంటుంది - న‌టుడు స‌త్య‌రాజ్‌

హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న స‌త్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `దొంగ‌`.

'ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో మొక్కలు నాటిన సాయి తేజ్, రాశి ఖన్నా

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి.