మాజీ హోంమంత్రి నాయిని పరిస్థితి విషమం..

  • IndiaGlitz, [Friday,October 16 2020]

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యుల ఇటీవల అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా.. నేడు ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు ఆయనను అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.

గత నెల 28న నాయిని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరి చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో పాటు పరీక్షల్లో సైతం కరోనా నెగిటివ్ రావడంతో నాయిని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. కాగా మూడు రోజుల క్రితం ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటనే కుటుంబ సభ్యులు అపోలోకు తరలించారు. పరీక్షల్లో నాయినికి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తరువాత ఆక్సీజన్ లెవల్స్ కూడా పడిపోయాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.