మాజీ హోంమత్రి నాయిని కన్నుమూత.. మధ్యాహ్నం అంత్యక్రియలు

  • IndiaGlitz, [Thursday,October 22 2020]

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. గత నెల 28న ఆయనకు కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. టెస్టుల్లో నెగిటివ్ రావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే నాయిని తిరిగి అస్వస్థతకు గురయ్యారు.

న్యుమోనియా తలెత్తడంతో కుటుంబ సభ్యులు.. నాయినిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా అపోలో వైద్యులు గుండె ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు. అయినా ఆరోగ్యం బాగుపడకపోవడంతో.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించింది. కాగా గత అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ఇక నాయిని సతీమణి అహల్యకు కూడా కరోనా సోకింది. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.

కాగా.. నాయిని అంత్యక్రియలు నేడు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సీఎస్.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్‌కు నాయిని భౌతిక కాయాన్ని తరలించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు క్వార్టర్స్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

More News

ముగ్గురే అయినా హౌస్‌ను వణికించేశారు..

మంచి మనుషులు.. కొంటె రాక్షసులు టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది.

మాజీ హోంమంత్రి నాయినిని పరామర్శించిన కేసీఆర్..

మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి నాయినిని చూసేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లారు.

ఆ డైరెక్టర్‌తో చరణ్‌కి ఈసారైనా వర్కవుట్‌ అయ్యేనా..?

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివకు ఎందుకనో సినిమా కుదరడమే లేదు. ప్రారంభంలో వీరిద్దరి కలిసి 'మెరుపు'

లారెన్స్‌ 'లక్ష్మీబాంబ్‌'కు కొత్త సమస్య

రాఘవ లారెన్స్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'లక్ష్మీబాంబ్‌'ను ఏ ముమూర్తాన స్టార్ట్‌ చేశారో కానీ.. సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.