మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు. ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు సోమవారం కరోనా పరీక్ష చేయించారు. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను భద్రాచలం నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో రాజయ్య మృతిచెందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999,2004, 2014లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఎం నేతగా ప్రజల పక్షాన పోరాడారు. కొద్ది కాలంగా ఆయన తన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో ఉంటున్నారు. సున్నం రాజయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. కాగా... ఆయన కుమారులిద్దరితో పాటు అల్లుడికి కూడా కరోనా సోకడంతో వారు ప్రస్తుతం బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.

More News

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..

ప్ర‌ముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77)  మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా..

48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్

మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్..

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది.

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్..

కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రిటీల పెళ్లిలన్నీ సింపుల్‌గా జరిగిపోతున్నాయి.