మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Monday,August 10 2020]

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

‘‘నేను వేరే పని మీద ఆసుపత్రికి వెళ్లినప్పుడు.. నాకు వైద్యులు కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఒక వారం రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా సెల్ఫ్ అసోలేషన్‌లో ఉండటంతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా’’ అని ప్రణబ్ ముఖర్జీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రణబ్ ఓ ఆర్మీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

More News

సూపర్ ఫైన్‌గా ఉన్నా.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ: వర్మ

తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు వర్మ డంబెల్స్‌తో సిద్ధమై పోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో చేశారు.

సరదాగా అమ్మ కోసం.. తిడుతుందో.. బ్రహ్మాండం అంటుందో.. : చిరు

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల వేపుడు చేశారు.

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు.

విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది: చిరంజీవి

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.