త‌క్కువ గ్యాప్‌లో నాలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌

  • IndiaGlitz, [Saturday,January 06 2018]

భాస్కరభట్ల రవికుమార్.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో మాస్, రొమాంటిక్, మెలోడీ పాట‌ల‌కు సాహిత్యాన్ని అందించిన గీత ర‌చ‌యిత‌. కాకపోతే మాస్ పాటలే ఆయన బలం. ఈ సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాల్లో మూడు పాటలు.. ఈ రచయిత కలం నుంచి జాలువారినవే. ఈ నెల 10న రిలీజ్ కానున్న 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ పాడిన 'కొడకా కోటేశ్వర్రావూ' పాటైతే.. ఖండ ఖండాలు దాటి పోలాండ్ బుడతడు పాడేవరకు వెళ్ళింది.

ఇక 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న బాలకృష్ణ 102వ చిత్రం 'జై సింహా'లో.. జస్ప్రీత్ జాజ్, గీతామాధురి ఆలపించిన 'అమ్మకుట్టి అమ్మకుట్టి' మాస్ పాట కాగా.. ఇక ఇదే చిత్రంలో శ్రేయా ఘోషల్, రేవంత్ పాడిన 'ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది' మెలోడీ పాట సాహిత్యం అల‌రించేలా ఉంది. వీటితో పాటు నాగశౌర్య, రష్మిక మందన్న నాయకానాయికలుగా నటించిన 'ఛలో' మూవీలో 'చూసీ చూడంగానే' అనే మరో మెలోడీ పాట‌కి అల‌రించేలా సాహిత్యాన్ని అందించారు భాస్కరభట్ల.

ఫిబ్ర‌వ‌రి 2న ఈ సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి.. త‌క్కువ గ్యాప్‌లో విడుద‌లైన‌.. ఈ మూడు చిత్రాలకి సంబంధించిన నాలుగు పాటలు సూప‌ర్ హిట్ అయ్యాయి.

More News

'జువ్వ' మోషన్ పోస్టర్ విడుదల

రంజిత్,పాలక్ లల్వానీ హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'జువ్వ'.

జూన్‌ నుంచి జయ బి. దర్శకత్వంలో కొత్త చిత్రం

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మి&

'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ రేపు విడుదల

'దేనికైనా రెడీ','ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు

అంతా వట్టిదే అంటున్న వరుణ్ తేజ్...

మెగా కాంపౌండ్ కు చెందిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ..

వివాదంలో సూర్య 'గ్యాంగ్' ...

సూర్య,కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్'.