జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్కర్‌, నితేష్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 8న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''సోషల్‌ మీడియాకు యువత ఎలా బానిసలవుతున్నారు, తద్వారా వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాన్ని తీసుకొని మెసేజ్‌ ఓరియంటెడ్‌గా ఈ చిత్రాన్ని చేశాం. హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది. జూలై 8న ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

సహ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ - ''ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి మంచి క్రేజ్‌ వచ్చింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చిత్రానికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్‌ కోసం సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మా యూనిట్‌ సభ్యులను సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ ప్రత్యేకంగా కలుసుకొని అందరికీ అభినందనలు తెలియజేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుతం మా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని సెంటర్స్‌ను సందర్శిస్తున్నాం. మా చిత్రం ఎలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిందీ, ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని చేశాం అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాం. మా చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 8న రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్‌కర్‌, నితేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాఘవ, సంగీతం: లవన్‌, వీరన్‌, కెమెరా: సిద్ధార్థ్‌, సహనిర్మాత, నిర్మాణ, నిర్వహణ: విజయవర్మ పాకలపాటి, నిర్మాణం: మోడ్రన్‌ సినిమా, కథ, దర్శకత్వం: ఆదిత్య ఓం.

More News

జార్జియాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' క్లైమాక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ చారిత్రాత్మక వంద‌వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`  శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్ర

'అత్తారిల్లు' ఆడియో విడుద‌ల‌

అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వం నిర్మిస్తున్న‌ చిత్రంలో  ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఆడియో ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో  జ‌రిగింది.

సమంత బాగా హర్ట్ అయ్యింది..

అటు కోలీవుడ్-ఇటు టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న ముద్దుగుమ్మ సమంత.యువ సమ్రాట్ నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారు...

వెంకీని బాధపెట్టిన డైరెక్టర్....

విక్టరీ వెంకటేష్ ని బాధపెట్టిన డైరెక్టర్ ఎవరో కాదు యూత్ చిత్రాల దర్శకుడు మారుతి.ఇంతకీ విషయం ఏమిటంటే...వెంకీ -మారుతి కాంబినేషన్లో రూపొందిన చిత్రం బాబు బంగారం.

గోపీచంద్, సంపత్ నందిల కొత్త చిత్రం

`యజ్ఞం`,`ఆంధ్రుడు`,`లక్ష్యం`,`శౌర్యం`,`శంఖం`,`గోలీమార్` వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.