close
Choose your channels

ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను: ప్రభాస్

Sunday, August 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను: ప్రభాస్

ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం `సాహో`. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌‌ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకల్లో ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ```సాహో` కోసం రెండేళ్ల సమయాన్ని కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే `బాహుబలి` సినిమా కోసం నాలుగేళ్ల సమయం కేటాయించాను. కానీ `సాహో` సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఏడాది సమయం పట్టింది. అందుకోసం రిహార్సల్స్ చేయడంతో సమయం పట్టేసింది. మరో సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగ్ పూర్తయ్యింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను`` అన్నారు ప్రభాస్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.