వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు, ఇన్సెంటివ్స్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల (మార్చి) పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. మొదట పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు జీతాల కోత ఉంటాయని కేసీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. అయితే వారి నుంచి వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంతేకాదు.. అవసరమైతే ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్సెంటివ్‌ను ఒకటి రెండు రోజుల్లో కేసీఆరే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. ప్రగతి భవన్‌లో బుధవారం రాత్రి జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. పూర్తి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారన్న మాట. ఈ ప్రకటన గురించి విన్న వైద్య, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన అనంతరం ఆయా సంఘాలు మీడియా ముందుకు ధన్యవాదాలు తెలపనున్నాయి.

More News

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో ఎక్కువే!

యావత్ దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా కోలుకుంటోందనుకున్న టైమ్‌కు ఢిల్లీలోని నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా

నిర్మాత ట్వీట్‌కు కెటీఆర్ రిప్లై

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం స్తంభిస్తే.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారు అట్టుకుడికిపోతున్నారు. ఢిల్లీ వంటి కేంద్ర రాజ‌ధానిలో కార్మికుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

మెగాభిమానుల‌కు ఆ విష‌యంలో నిరాశ త‌ప్ప‌దా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శివగామితో సాయితేజ్ పోరు

గత ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న కోన‌!!

ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్ కోన వెంక‌ట్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారాయ‌న. కెరీర్ ప్రారంభంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా