Gaami :జీ5లో ‘గామి’ సెన్సేషన్.. 72 గంటల్లోపు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..

  • IndiaGlitz, [Tuesday,April 16 2024]

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ‘గామి’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం.

హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.

More News

CM YS Jagan: దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు.. రాయి దాడిపై సీఎం జగన్ స్పందన ఇదే..

తనపై జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ స్పందించారు. గుడివాడలోని నాగవరప్పాడు వద్ద జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో తన గాయం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi: బీజేపీ అభ్యర్థికి చిరంజీవి మద్దతు.. నేనున్నాను అంటూ భరోసా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. కానీ రాజకీయాల్లో తన మద్దతు మాత్రం కొంతమందికి తెలియజేస్తున్నారు.

Pawan Kalyan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు ఆ నలుగురిదే బాధ్యత: పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారుల చేతే విచారణ చేయించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఒకేరోజు రెండు షాక్‌లు..

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒక్కరైన నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు