అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం 'గ‌జేంద్రుడు'. ఆర్య‌, కేథరీన్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల‌ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. గజేంద్రుడు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.
నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మాట్లాడుతూ..మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్నప్రోడ‌క్ష‌న్‌నెం 89వ సినిమా 'గ‌జేంద్రుడు'. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పాత్ర‌కు త‌గ్గట్టుగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా వేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. గ‌జేంద్రుడు ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫ్యామిలి అంతా ఎంజాయ్ చేసే చిత్రంగా మా గ‌జేంద్రుడు వుంటుంది. యువ‌న్‌శంక‌ర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. అని అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌రో కొత్త చిత్రం ఈ గ‌జేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.

More News

అలీ చేతులమీదుగా 'బ్లాక్ మనీ' ట్రైలర్ ఆవిష్కరణ

సౌత్ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన మలయాళ సూపర్హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్మనీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

'దేవిశ్రీప్రసాద్' టీజర్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - దర్శకుడు శ్రీ కిషోర్

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.

యదార్థ ఘటన ఆధారంగా 'డేగల శ్రీను' ప్రారంభం

ఆర్.ఎఫ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమర్నాథ్ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుదవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

నాని హీరోయిన్ తో నితిన్...

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లై`. 14 రీల్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

నాని దర్శకుడితో అల్లుడు శీను..

హీరో నాని రీసెంట్ హిట్ `నేను లోకల్`. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశాడు. అంతకు ముందు రాజ్ తరుణ్తో సినిమా చూపిస్తమావ సక్సెస్ను సాధించాడు త్రినాథరావు నక్కిన, ఈ డైరెక్టర్తో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వర్క్ చేయబోతున్నాడట.