ఏప్రిల్ 14న విడుదల కానున్న 'గజేంద్రుడు'

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం 'గ‌జేంద్రుడు'. ఆర్య‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల‌చేస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మాట్లాడుతూ.. మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్నప్రోడ‌క్ష‌న్‌నెం 89వ సినిమా 'గ‌జేంద్రుడు'. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పాత్ర‌కు త‌గ్గట్టుగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. పిల్ల‌ల్ని బాగా అల‌రించే చిత్రంగా గ‌జేంద్రుడు ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫ్యామిలి అంతా వ‌చ్చి చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా మా గ‌జేంద్రుడు వుంటుంది. యువ‌న్‌శంక‌ర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతుంది. నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి తెలిపారు.
హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌రో కొత్త చిత్రం ఈ గ‌జేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.

More News

'ప్రేమతో మీ కార్తీక్ ' సమ్మర్ లో విడుదల

ప్రతి మనిషి కి కెరీర్ మీద కాన్సంట్రేట్ వుండాలి.అలాఅని మన లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే.

మే 5న 'రక్షకభటుడు' - నిర్మాత ఎ.గురురాజ్

వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రక్షకభటుడు`. ఈ సినిమాను మే 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సుఖీభవ మూవీస్ పతాకంపై రూపొందుతోంది.

నాగశౌర్య హీరోగా తన సొంత బ్యానర్ ఐరా క్రియోషన్స్ లో రష్మిక మండన్న హీరోయిన్ గా చిత్రం ప్రారంభం

"ఊహలు గుసగుసలాడే", "దిక్కులు చూడకు రామయ్య", "లక్ష్మిరావే మా ఇంటికి", "కళ్యాణ వైభోగమే"," జ్యో అచ్యుతానంద" లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించిన నాగశౌర్య హీరోగా, కన్నడ లో "కిరాక్ పార్టీ" అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకున్న రష్మిక మండన్నని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ.

జవాన్ సెట్ లో దిల్ రాజు ని సత్కరించిన సాయి ధరం తేజ్

సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఉన్న భందం తెలిసినదె సాయి తో 3 సక్సెస్ ఫుల్ల్ చిత్రాలని అందించారు దిల్ రాజు.

చరణ్ మూవీలో అనసూయ...

జబర్ దస్త్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన అనసూయకు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.