close
Choose your channels

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

Monday, November 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

వ‌రుసగా భ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో గాలి సంప‌త్ ప్రారంభ‌మైంది. ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్.క్రిష్ణ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. త‌న మిత్ర‌డు ఎస్‌. క్రిష్ణ కోసం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ సైడ్ ఈ చిత్రానికి అనిల్ రావిపూడి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ని స్థాపించి ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు క్లాప్ నివ్వ‌గా హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన మొద‌టి స‌న్నివేశానికి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్క్రిప్ట్‌ను నిర్మాత ఎస్‌విసి శిరీష్ ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ‌కు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా..

బ్లాక్ బ‌స్ట‌ర్ ‌డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - `` నా స్నేహితుడు ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ని స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి నిర్మిస్తోన్న`గాలి సంప‌త్` చిత్రం ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయి శ్రీ‌రామ్ కెమెరామెన్. అలాగే మిర్చికిర‌ణ్ డైలాగ్స్ రాస్తున్నారు. నేను ఈ సినిమాకు మెంట‌ర్‌గా ఉంటున్నాను. నా సినిమాల‌న్నింటికీ కో-రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సాయి అద్భుత‌మైన క‌థ రాశాడు. ఎక్స్‌ట్రార్డిన‌రీ స్క్రిప్ట్‌. స‌బ్జెక్ట్ న‌చ్చి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నాను. ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో పాటు మంచి ఎమోష‌న్ కూడా ఉంటుంది. డెఫినెట్‌గా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. ఈ నెల 18 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. త్వ‌ర‌లోనే మీముందుకు వ‌చ్చి మిమ్మ‌ల్నంద‌రినీ ఎంట‌ర్టైన్ చేయ‌బోతున్నాడు మా `గాలి సంప‌త్`‌. శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తుండ‌గా గాలి సంప‌త్ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌గారు న‌టిస్తున్నారు. ఆయ‌న ఎన్నోగొప్పక్యారెక్టర్స్ చేశారు. ఆయ‌న కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. అలాగే శ్రీ విష్ణుది కూడా ఒక ఎక్స్‌ట్రార్డిన‌రీ రోల్‌. ఈ చిత్రం, తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ ను ప్రెజెంట్ చేయబోతోంది. తండ్రీ కొడుకుల మద్య జ‌రిగే బ్యూటిఫుల్ జ‌ర్నీఈ సినిమా. త‌ప్ప‌కుండా మిమ్మ‌లంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది`` అన్నారు.

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో విష్ణుకి ఫాద‌ర్‌గా గాలి సంప‌త్ అనే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఈ మ‌ధ్య‌ కాలంలో నా మీద రాసిన ఒక అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ఇది. ఈ మూవీ మంచి విష‌యం ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా ఉండ‌బోతుంది`` అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - `` గాలి సంప‌త్ ఒక అద్బుత‌మైన ట్రీట్ లాంటి సినిమా. ఒక కొత్త ర‌క‌మైన స్క్రిప్ట్‌. అలాగే అచ్చ తెలుగు స్క్రిప్ట్‌. ఈ సినిమాలో నాకు ఫాద‌ర్‌గా రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు మంచి క‌థ అందించిన సాయి గారికి, అనిల్ గారికి అలాగే షైన్ స్క్రీన్స్ సాహు, హ‌రీష్ గారికి థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమాగా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

చిత్ర నిర్మాత ఎస్. క్రిష్ణ మాట్లాడుతూ - ``ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బేనర్స్ క‌లిసి నిర్మిస్తోన్న గాలి సంప‌త్ సినిమా ద్వారా నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా టీమ్ కి విషెస్ తెలియజేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన దిల్‌రాజు గారికి, శిరీష్ గారికి, నారా రోహిత్ గారికి, వ‌రుణ్ తేజ్ గారికి ద‌న్య‌వాదాలు. అలాగే ఈ సినిమాని ప్ర‌జెంట్ చేస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తోన్న అనిల్ రావిపూడి గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద‌ విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.