Game Changer:'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్‌.. ఇక జరగాల్సిందే..

  • IndiaGlitz, [Tuesday,March 26 2024]

దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టైటిల్ పోస్టర్ తప్ప ఏ అప్‌డేట్ రాలేదు. గతేడాది దసరా, దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయినా కానీ విడుదల చేయలేదు. అలాగే మూవీ షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఎట్టకేలకు చెర్రీ అభిమానులకు మేకర్స్ శుభవార్త అందించారు. బుధవారం చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'జరగండి' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటను మార్చి 27వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవలే ఈ సాంగ్ నెట్టింట లీక్ అయి విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే పాటను అధికారికంగా విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను భారీ జనాభాతో ఎంతో గ్రాండ్‌గా శంకర్ తీశారని మూవీ యూనిట్ చెబుతోంది.

ఇక చెర్రీ సినిమా విషయానికొస్తే 'రంగస్థలం' కాంబో రిపీట్ కానున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ ఓ మూవీలో చెర్రీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజాకార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో చరణ్ సరసన అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

మొత్తానికి RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు చెర్రీ సినిమాలు థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. రెండు సంవత్సరాల గ్యాప్‌లోనే ఈ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More News

Pawan Kalyan:పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం.. ఎప్పుడంటే..?

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

IPL Schedule 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Chandrababu: అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు.

Gali Janardhan Reddy: బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. పార్టీ విలీనం..

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhana Reddy) తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.