'గేమ్ ఆన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 30 2021]

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న గేమ్ ఆన్ సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది.సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.హీరోగా రథం ఫేం గీతానంద్ తన తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకొని అందరి ప్రశంశలు పొందిన గీతానంద్ హీరోగా నటిస్తున్నారు.దర్శకుడు దయానంద్ తన మొదటి సినిమా బాయ్స్ తో అందరి టెక్నీషియన్స్ మన్ననలు పొంది యూత్ ని ఆకట్టుకునేలా త్వరలో రిలీజ్ కు సిద్ధమై ఉంది.ఈ ఇద్దరి కలయికతో నిర్మిస్తున్న గేమ్ ఆన్ సినిమా సరికొత్త కథతో ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథాంశంతో మంచి టెక్నీషియన్ తో నిర్మిస్తున్న చిత్రం. సినిమా స్టార్ట్ చేయకుండానే సినిమా కథ తెలిసి హిందీ రైట్స్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది.

నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్,లవ్ సెంటిమెంట్స్, ట్విస్టులు ఇలా అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నా టాప్ టెన్ మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు.మంచి టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు.చాలా మంచి ఇంపార్టెంట్ మధుబాల మదర్ క్యారెక్టర్ చేస్తుంది. కన్నడ కిషోర్, మధుసూదన్ చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కుమార్ బాబు తెలియజేశారు.

More News

‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది : హీరో స‌త్య‌దేవ్‌

వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో

ఈ దర్శకులు సినిమా తీస్తే.. ఆయన పాట వుండాల్సిందే, ఇది ‘‘ సిరివెన్నెల ’’ ప్రస్థానం..!!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని టార్గెట్ చేసిన ఆ నలుగురు.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు చివరి దశకు చేరుకోవడంతో షో ఉత్కంఠగా మారుతోంది. ఇక కొద్దివారాలే మిగిలి వుండటంతో ఎవరు ఉంటున్నారు..?

కెరీర్‌లో తొలిసారిగా.. నవ్విస్తానంటున్న అందాల రాక్షసి

"అందాల రాక్షసి" సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠీ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది.

ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. హెల్త్ బులిటెన్ విడుదల

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్ధితిపై సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రి వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.