Gandipet Park: భాగ్యనగరానికి మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన ‘గండిపేట పార్క్’, ప్రత్యేకతలెన్నో..!!

  • IndiaGlitz, [Saturday,September 03 2022]

హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట.. కానీ కాలక్రమంలో మరిన్ని ఆధునిక హంగులు నగరానికి సమకూరాయి. ఈ కోవలోనే సైబర్ టవర్స్, రామోజీ ఫిలింసిటీ, కేబుల్ బ్రిడ్జి ఇలా మరెన్నో భాగ్యనగరానికి మణిహారంలా వెలుగొందుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అదే గండిపేట పార్క్. దాదాపు 5.50 ఎకరాల విస్తీర్ణంలో రూ.35.60 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమీషనర్ అర్వింద్ కుమార్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

హుస్సేన్ సాగర్ మాదిరిగా పర్యాటక ప్రాంతంగా గండిపేట:

ప్రస్తుతం ఐటీ, ఫార్మా, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ , జాతీయ సంస్థలు భాగ్యనగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రంతాలకు గండిపేట అత్యంత చేరువలోనే వుంది. దీంతో కార్పోరేట్ సంస్థల సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లు, సినీ, వ్యాపార ప్రముఖులు ఆ ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ మాదిరిగానే గండిపేట జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుని పనులను చేపడుతోంది. ఈ పనులన్నీ పూర్తి చేసుకుని గండిపేట పార్క్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీనిపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అందమైన హైదరాబాద్ నగరాన్ని పచ్చగా మార్చేందుకు మరో కొత్తది చేరిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కమీషనర్ అర్వింద్ కుమార్‌ను ఆయన అభినందించారు.

గండిపేట పార్క్ ప్రత్యేకతలివే:

గండిపేటకు వున్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా పార్కును అత్యాధునిక శైలిలో నిర్మించారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్‌లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్‌నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్వాతగ ద్వారాన్ని ఓ పువ్వు ఆకారంలో భారీగా నిర్మించారు.

More News

Janasena : జనసేన జెండా చూస్తేనే వైసీపీ వణుకుతోంది.. దిమ్మెలు ధ్వంసం చేస్తే ఆగుతామా: నాదెండ్ల మనోహర్

విజయవాడలో జనసేన జెండా దిమ్మెలు ధ్వంసమైన ఘటనపై స్పందించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర 'అందాల నటుడు'

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు

INS Vikrant: నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ : ఆ దేశాల సరసన ఇండియా, ప్రత్యేకతలివే

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. మనదేశం దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను

బ్రహ్మాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. నిరాశలో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్, కారణమిదేనా..?

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Prince: శివకార్తికేయన్ 'ప్రిన్స్' ఫస్ట్ సింగల్ 'బింబిలిక్కి పిలాపి' విడుదల

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా,