Garikapati:అబ్బా ఏం డ్యాన్స్ చేశారు.. చిన్నావాళ్లయినా ఎన్టీఆర్, చరణ్‌లకు నమస్కరిస్తున్నా : ‘‘నాటు నాటు’’పై గరికపాటి

  • IndiaGlitz, [Saturday,March 04 2023]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.

అమెరికాలో మకాం వేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్:

ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కార్ కొట్టి తీరాలన్న కసితో జక్కన్న పనిచేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాతో పాటు హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి భేటీ అవుతున్నారు. అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా, నందమూరి అభిమానులతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు పాట ప్రపంచస్థాయికి చేరుకుంది :

ఇదిలావుండగా.. నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం పట్ల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు స్పందించారు. ఆ పాట తనకు గర్వకారణమని.. దీనిని స్వచ్ఛమైన తెలుగులో రాశారని, అలాంటి పాట ప్రపంచస్థాయికి చేరుకోవడం సంతోషించదగ్గ విషయమని గరికపాటి అన్నారు. ఇద్దరు హీరోలు (రామ్ చరణ్, ఎన్టీఆర్) తమ బెస్ట్‌ను అందించి, పాటకు మరింత వైభవాన్ని జోడించారని నరసింహారావు ప్రశంసించారు. ఎంఎం కీరవాణి ట్యూన్‌ని, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌ని అందరం మెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నిన్న మొన్నటి వరకు నాటు నాటు గురించి తెలియదు:

నిన్న మొన్నటి వరకు ఆ పాట గురించి తనకు తెలియదని.. కానీ ఆస్కార్ నామినేషన్స్ విషయం తెలియగానే 30 నిమిషాల పాటు దానిని విన్నానని గరికపాటి అన్నారు. ఆ పాట పక్కా తెలుగని.. చంద్రబోస్‌ను తాను నిజంగా అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అలాంటి పాట రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశాడని.. నెలల పాటు గడిపాడని నిజమైన సాధన అదేనని గరికపాటి ప్రశంసించారు. కళలో నైపుణ్యం అంత తేలికగా రాదని.. ఆస్కార్‌కు మన పాట నామినేట్ కావడం గర్వించదగ్గ విషయమని నరసింహారావు పేర్కొన్నారు. నాటు నాటు ఆస్కార్‌ను గెలవాలని దేవుడిని ప్రార్ధించాలని.. ఇది తెలుగు వారికి ఎప్పటికీ గర్వకారణమని గరికపాటి అన్నారు. ఇక ప్రధానంగా.. చరణ్, ఎన్టీఆర్‌లు లయబద్ధంగా చేసిన డ్యాన్స్‌ని మెచ్చుకున్నారు. వారిద్దరు గొప్ప నటులని , వారు తనకంటే చిన్నవారైనప్పటికీ తాను వారికి నమస్కరిస్తున్నానని నరసింహరావు వెల్లడించారు.

More News

Anchor Shyamala:మొన్ననే లగ్జరీ హౌస్‌లో గృహ ప్రవేశం.. ఇప్పుడు మరో భూమిపూజ, శ్యామల సంపాదనపై ట్రోలింగ్

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తెలుగు యాంకర్లలో శ్యామల ఒకరు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయినా శ్యామల ఫిగర్‌లో

Nadendla Manohar:ఇప్పటంలో మళ్లీ ఇళ్ల కూల్చివేతలు.. జగన్ కళ్లలో ఆనందం కోసమే : నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

గుంటూరు జిల్లా ఇప్పటంలో అధికారులు మరోసారి ఇళ్ల కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Balakrishna:మరోసారి వివాదాస్పదమైన బాలయ్య తీరు.. ఈసారి సొంత అభిమానుల నుంచే, నందమూరి ఫ్యాన్స్ చీలిపోతారా..?

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

Manchu Manoj : ఒక్కటైన మనోజ్- భూమా మౌనిక, భార్యను ముద్దాడుతూ మంచు వారబ్బాయి.. ఫోటోలు వైరల్

సినీనటుడు మంచు మనోజ్ వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘనంగా జరిగింది. దివంగత భూమా నాగిరెడ్డి- శోభ దంపతుల రెండో కుమార్తె మౌనికా రెడ్డి ఆయన పెళ్లాడారు.

Puli Meka:జీ 5లో 75 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘పులి మేక’

వ‌న్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్స్‌లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5.