'గౌతమ్ నంద' గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల!

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాం. బియర్డ్ లుక్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సంపత్ నంది ఆయన పాత్రను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 24న హైద్రాబాద్ లో మొదలుకానుంది. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతాం. మార్చ్ లో పాటల్ని విడుదల చేసి.. ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
నికితన్ ధీర్, తనికెళ్లభరణి, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

More News

టాంటెక్స్ లో అవార్డు అందుకున్న జెమిని సురేష్...

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)డల్లాస్ లో జనవరి 28న సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

నిఖిల్ మూవీ ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న...

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.రీసంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో

'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

సాయిధరమ్ తేజ్ హీరోగా గ్రాండ్గా తెరకెక్కుతున్న చిత్రం `విన్నర్`. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు.

'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'

ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '.