Gazette Notification:తెలంగాణ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

  • IndiaGlitz, [Monday,December 04 2023]

బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలో రావడంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై రద్దు చేశారు. దీంతో కొత్త అసెంబ్లీను ఏర్పాటుచేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను అందజేసింది. అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్‌కు అందజేశారు.

దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు కానుంది. కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ మరికొన్ని గంటల్లో జరగనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి సీఎల్పీ నేతగా ఎన్నికైన వారి పేరును నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు సీఎం గుర్తింపు హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. మరోవైపు నూతన ముఖ్యమంత్రి, మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. కొత్త మంత్రుల కోసం సిద్ధం చేసిన అధికారులు వాహనాలను దిల్ కుష అతిథి గృహానికి తీసుకువచ్చారు.

More News

Allu Aravind:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం: అల్లు అరవింద్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telangana Women MLAs:తెలంగాణ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళా అభ్యర్థులు వీరే..

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో పది మంది మహిళలు గెలిచారు.

CM, Deputy CM:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Janasena: హైదరాబాద్‌లో మూసీ నది పాలైన జనసేన, టీడీపీ పరువు

అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడు అన్న చందంగా సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు కానీ వేరే రాష్ట్రంలో పోటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Typhoon effect:తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు..

మించౌగ్ తుపాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి,