రెండేళ్లు పూర్తి చేసుకున్న గీత గోవిందం

  • IndiaGlitz, [Friday,August 14 2020]

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా గీత గోవిందం. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా లో హప్పెనింగ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందాన గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్, వెరసి రెండేళ్లు క్రితం ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సర్ప్రైజ్ బ్లాక్బస్టర్ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంది.

పరుశరామ్ డైరెక్షన్ స్కిల్స్

మొదటి నుంచి అన్ని వర్గాలు ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ రూపొందిస్తున్న పరుశరామ్ గీత గోవిందం సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయారు. ఈ చిత్రాన్ని థియేటర్ కి వెళ్లి హాయిగా చూసి నవ్వుకొని, ఎంజాయ్ చేసి వచ్చే రీతిన మలచడంలో పరుశరామ్ కీలకం అని చెప్పాలి. కథ ఎక్కడ గాడి తప్పకుండా అందులోనే కమర్షియల్ అంశాలు జోడించి, గీత గోవిందం ను బ్లాక్బస్టర్ సినిమాగా మార్చి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలానే సినిమాటోగ్రాఫర్ ఎస్ మణికందన్ కెమెరా పని తనం ఈ చిత్రాన్ని ఓ విజువల్ ఫీస్ట్ గా మార్చేసింది.

గీతా ఆర్ట్స్ ప్రోడక్ట్

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి యే సినిమా వచ్చిన, అది ఓ రేంజ్ సక్సెస్ ఇస్తుందనే నమ్మకాన్ని గీతా గోవిందం మరోసారి రుజువు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలో, బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీత గోవిందం పై ఉండటమే ముఖ్య కారణం.

విజయ్ దేవరకొండను ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా

అర్జున్ రెడ్డి తరువాత వస్తున్న సినిమా కావడం తో గీత గోవిందం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఐతే అర్జున్ రెడ్డి ని ఎక్కువుగా యూత్ ఫాలో ఐయ్యారు. కానీ గీతా గోవిందం తో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అలానే కెర్రిర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కూడా గీత గోవిందం రూపం లో విజయ్ ఖాతాలోకి వచ్చి చేరింది. అలానే ఈ సినిమా లో గీత గా నటించిన రష్మిక కూడా ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది.

మరుపురాని గీతం ఇంకేం ఇంకేం కావాలె

ఈ దశాబ్ధపు మరుపు రాని గీతాల్లో గీత గోవిందం మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న ఇంకేం ఇంకేం కావాలె పాట టాప్ 3 పోసిషన్ లో ఉండటం ఖాయం. ఈ పాట రిలీజ్ ఐనా దగ్గర నుంచే గీత గోవిందం సినిమాకు వీపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు మూడు వందల ఏభై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాటని ప్రేకక్షులు యే రేంజ్ లో విన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా గీత గోవిందం మ్యూజికల్ బ్లాక్బస్టర్ గా రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకుంది.

More News

నిహారిక నిశ్చితార్థానికి పవన్ హాజరు కాకపోవడానికి కారణమిదే..

మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.

సాయితేజ్ - సుకుమార్ రైటింగ్స్ కొత్త‌ చిత్రం

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ క‌థానాయ‌కుడిగా

దేవాక‌ట్ట జాగ్ర‌త్త‌....

డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట ఈసారి కాస్త జాగ్ర‌త్తప‌డ్డారు. ఆయ‌న త‌దుప‌రి చేయ‌బోయే సినిమాకు సంబ‌బంధించిన థీమ్ మోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

మెగా డాటర్ నిశ్చితార్థం.. ఆ లోటు మాత్రం కనిపించింది..

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యతో

వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా: అజయ్ భూపతి

టాలీవుడ్‌ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇటీవల కరోనా కారణంగా తరచూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు.