తెలుగు ప్రేక్షకులంతా 'మెట్రో' చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా: గీతా మాధురి

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై 'ప్రేమిస్తే', 'జ‌ర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా 'మెట్రో'. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
ఈ సంద‌ర్భంగా గీతా మాధురి మాట్లాడుతూ '' మెట్రో సినిమాలో ఓ పాట‌, పాడుతూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. సురేష్ కొండేటి గారు 'జ‌ర్నీ', 'పిజ్జా' లాంటి ఎన్నో హిట్ సినిమాల‌ను అందించారు. ఇప్పుడు 'మెట్రో' సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. మ‌హిళలాంతా ఇప్పుడు గొలుసు దొంగ‌ల భారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి స్నాచ‌ర్ల‌కి ఎలా గుణ‌పాఠం చెప్పాలో సినిమా లో చ‌క్క‌గా చూపించారు. సినిమా చాలా బాగుంది. తెలుగు ప్రేక్ష‌కులంతా కూడా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ 'ఇన్నాళ్లు తెర‌వెన‌క గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై త‌ను క‌నిపించ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం'' అని తెలిపారు.
నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ-''చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మార్చి 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

More News

మహా శివరాత్రి సందర్భంగా 'ఉంగరాల రాంబాబు' హీరో సునీల్ ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.

రాశి కీలకపాత్రలో వస్తున్న 'లంక'

నిన్నటితరం అందాల భామ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు

'విన్నర్ ' తేజు రేంజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళే చిత్రమవుతుంది - గోపీచంద్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'.

'కేరాఫ్ గోదావరి' పది నిమిషాల సినిమా విడుదల

"క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్" అనే వెరైటీ ట్యాగ్ లైన్ తో రూపొందిన చిత్రం "కేరాఫ్ గోదావరి". రోహిత్.ఎస్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూవీస్ సమర్పణలో ఆర్.ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్-బొమ్మన ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తూము రామారావు(బాబాయ్)-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వెంకీ టైటిల్ తో శర్వానంద్

రన్రాజారన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ప్రెస్ రాజా వంటి సూపర్హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అక్ష కథానాయికలుగా,