close
Choose your channels

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

Thursday, May 21, 2020 • తెలుగు Comments

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

బాలీవుడ్ భామ జెనీలియా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఈమె త్వ‌ర‌లోనే తెలుగులో రీఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తెలుగు విష‌యానికి వ‌స్తే ఈమె తెలుగులో స‌త్యం, సై, హ్యాపీ, ఢీ, రెఢీ ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. త‌ర్వాత బాలీవుడ్‌లోనూ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు కొంత‌కాలం దూర‌మైంది. అయితే ఈ మ‌ధ్య జెనీలియా ఓ మ‌రాఠీ చిత్రంలో న‌టించింద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ఇదే త‌రుణంలో సోష‌ల్ మీడియాలో జెనీలియా టాలీవుడ్ రీ ఎంట్రీపై వార్త‌లు వ‌స్తున్నాయి.

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

మీడియాలో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు మెగాస్టార్ 153వ చిత్రంగా ‘లూసిఫ‌ర్‌’ రీమేక్ కానుంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో జెనీలియాను న‌టింప‌చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ట‌. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఈమె ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై జెనీలియా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz