'జెంటిల్ మన్' రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం 'జెంటిల్‌మ‌న్‌'. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన తొలి టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మే 22న ఈ సినిమా పాటలను విడుదల చేసి జూన్ 10న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం నానికి మంచి బ్రేక్ తీసుకురావాలని ఆశిద్దాం.

More News

జ్యోతిల‌క్ష్మికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..

నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి. అనుకోకుండా ఒక రోజు, మాస్, ల‌క్ష్మీ, పౌర్ణ‌మి, రాఖీ త‌దిత‌ర చిత్రాల‌తో ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుంది.

ఫీల్ గుడ్ హ్యాట్రిక్ వచ్చేనా?

ఏకకాలంలో ఓ నిర్మాత మూడు చిత్రాలను నిర్మించడమే ఒక విశేషమైతే..ఆ మూడు కూడా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లుగా రూపొందడం మరో విశేషం.

కేన్స్ చల‌న చిత్రోత్స‌వంలో బాహుబ‌లి సంద‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ.. ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు రికార్డు స్ధాయి కలెక్ష‌న్స్ సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ రచయితను డైరెక్టర్ గా మారుస్తున్న...

ఎన్టీఆర్ ఈ ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంతో పెద్ద సక్సెస్ నే అందుకున్నాడు.

ఓవర్ సీస్ లో సూర్య హవా కొనసాగుతుంది....

సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24.