'సాహో' చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్

  • IndiaGlitz, [Monday,June 17 2019]

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మ్యూజిక్ లో స్పెషల్ ట్రెండ్ సృష్టించాడు జిబ్రాన్. సాహో చాప్టర్ 2 కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే కావడం తెలిసిందే.

రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్ తో వర్క్ పరంగా జిబ్రాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని చిత్రం దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

'సాహో'కి బై బై చెప్పిన బాలీవుడ్ న‌టుడు

`బాహుబ‌లి` ప్ర‌భాస్ తాజా చిత్రం `సాహో`. సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌. యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది.

'గుణ 369' టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!

'మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం...

మీ స్పందనకు ధన్యవాదాలు ‘సూర్య’ మిత్రమా!

తమిళ స్టారో హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూరారై పొట్రు’ చిత్రం. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్, దిగ్గజ నటుడు మంచు మోహన్‌ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

చేత‌న్ మ‌ద్దినేని, క‌శిష్ ఓరా జంట‌గా  న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం "ఫ‌స్ట్ ర్యాంక్ రాజు"..

స్క్రిప్టు.. మాట‌.. అన్నీ తానైన క్రిష్‌

క్రిష్ కి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మాంచి జోరైన స‌క్సెస్ కావాలి. అది ఏ రూపంలో అయినా ఓకే. అందుకే ఆయ‌న ఓ వెబ్‌సీరీస్‌ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌ని అనుకుంటున్న‌ట్టు వినికిడి.