జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం..

  • IndiaGlitz, [Friday,December 04 2020]

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపుతో 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 18 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగించింది. మెజార్టీ డివిజన్ల రెండో రౌండ్‌లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకల్లా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. 150 డివిజన్లకు 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌‌ను కేటాయించారు.

ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది 8,152.. పరిశీలకులు 31 మందిని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్‌కు సీసీ టీవీల ఏర్పాటు చేశారు. మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్‌దేవులపల్లి ఫలితం తేలనుంది. ఒక రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కింపు జరగనుంది. బ్యాలెట్ కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు అయింది. 74,67,256 ఓట్లకు... 34,50,331 ఓట్లు పోల్ అయ్యాయి.

More News

విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం..

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్లు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

పట్టు వదలని విక్రమార్కుల్లా అఖిల్, సొహైల్...

‘పట్టి పట్టి నన్నే సూస్తంటే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రేస్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్‌ మొదలైంది. అభి.. సంచాలకుడు.

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే

జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం సాయంత్రం వెల్లడించాయి. నిజానికి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల కావాల్సి ఉంది.

'జీ 5'లో డిసెంబర్ 4న 'కోమాలి' ప్రీమియర్

03  డిసెంబర్, 2020: తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'.

క్లాస్ రూమ్‌లో మైనర్ విద్యార్థుల పెళ్లి.. లైక్స్ కోసమేనట...

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల పెళ్లి కలకలం సృష్టించింది.