Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్, వెళ్తూ వెళ్తూ రాహుల్‌పై విమర్శలు

  • IndiaGlitz, [Friday,August 26 2022]

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. రాష్ట్రాల్లో సీనియర్ నేతల కుమ్ములాటలు, ఈడీ, సీబీఐ కేసులతో అల్లాడుతోన్న కాంగ్రెస్ అధిష్టానానికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ కురు వృద్ధుడు, సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడారు. పార్టీకీ, అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన శుక్రవారం అధిష్టానానికి లేఖ రాశారు. తన నాలుగు పేజీలో లేఖలో పార్టీ ప్రస్తుత దుస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆజాద్ సుతిమెత్తని విమర్శలు చేశారు. మేధోమథనంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదని, కనీసం వాటిని పరిశీలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు.

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో అందుకు గల కారణాలపై 23 మంది అసమ్మతి నేతలు తరచుగా ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆజాద్ కూడా ఒకరు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్ధితి మరింత దిగజారుతోందని ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను రాహుల్ ఆయన కోటరీయే నడిపిస్తోందని.. సోనియా గాంధీ పాత్ర నామమాత్రమేనని ఆజాద్ ఆరోపించారు,

ఇదీ ఆజాద్ ప్రస్థానం :

1973లో సాధారణ బ్లాక్ కాంగ్రెస్ సెక్రటరీగా ఆజాద్ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండేళ్లకే జమ్మూకాశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం తన పనితీరుతో పెద్దల దృష్టిలో పడ్డ ఆయన.. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తర్వాత 1980 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాశీమ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1982లో కేంద్ర సహాయ మంత్రిగా గెలిచారు. 1984లో మరోసారి ఎంపీగా గెలిచిన ఆయన.. 1990 నుంచి 1996 వరకు రాజ్యసభ సభ్యుడిగా పీవీ నరసింహారావు కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆజాద్ నియమితులయ్యారు. తర్వాత మన్మోహన్ సింగ్ సెకండ్ కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేతగా పనిచేశారు ఆజాద్. 2015లో మరోసారి జమ్మూకాశ్మీర్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

More News

Janasena : 'నా సేన కోసం నా వంతు'ని ప్రారంభించిన నాగబాబు.. యూపీఐ ద్వారా సింపుల్‌గా విరాళాలివ్వొచ్చు

కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమాన్ని ప్రారంభించారు

Actress Anjali: అంజలి ఆస్తులపై ట్రోలింగ్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..

తెలుగు తెరపై తెలుగమ్మాయిలు బొత్తిగా కనిపించని రోజుల్లో ఎంట్రీ ఇచ్చింది రాజోలు పిల్ల అంజలి. తన అందం, అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Anthele Katha Anthele: అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తనీష్, వికాస్ వశిష్ట ల 'అంతేలే కథ అంతేలే'

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం "అంతేలే కథ అంతేలే".రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్),

కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా 'శశివదనే' ఫస్ట్ లుక్ పోస్టర్

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా మరియు RX 100 రాంకీ,సంగీత దర్శకుడు

Naa Venta Padathunna Chinnadevadamma: సెప్టెంబర్ 2 న “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” రిలీజ్

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి,