విశాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

త‌మిళ హీరో, న‌డిగ‌ర్‌సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ సినిమాల‌కు తెలుగులోనూ మంచి ఆద‌ర‌ణ ఉన్నాయి. అందుక‌నే విశాల్ సినిమాల‌ను అటు త‌మిళంలోనూ, ఇటు తెలుగులో విడుద‌ల‌వుతుంటాయి. ఈయ‌నకు హైద‌రాబాద్‌కు చెందిన న‌టి అనీశారెడ్డికి మార్చిలో నిశ్చితార్థం జ‌రిగింది.

అయితే కొన్నిరోజుల త‌ర్వాత అనీశా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను తొల‌గించ‌డంతో..ప‌లు రూమ‌ర్స్ క్రియేట్ అయ్యాయి. విశాల్‌, అనీశా రెడ్డిల పెళ్లి ఆగిపోయింద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డ్డాయి. అయితే సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని విశాల్ తండ్రి, సీనియ‌ర్ నిర్మాత జి.కె.రెడ్డి తెలిపారు.

ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జి.కె.రెడ్డి విశాల్‌, అనీశారెడ్డి పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింద‌ని, ఆ ఫ‌లితాల్లో విశాల్ టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని, త‌ర్వాతే న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ పూర్తి చేసి అందులోనే విశాల్ పెళ్లి చేసుకుంటాడ‌ని తెలిపారు. అయితే పెళ్లి డేట్ ఫిక్స్ కాలేద‌ని, పెళ్లి తేదీ ఫిక్స్ కాగానే.. తెలియ‌జేస్తామ‌ని తెలిపారు జి.కె.రెడ్డి.

More News

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న బెల్లంకొండ?

హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఐదేళ్ల పాటు భారీ సినిమాలే చేశాడు. స‌క్సెస్ రాక‌పోయిన‌ప్ప‌టికీ గుర్తింపు మాత్రం బాగానే ద‌క్కింది.

'వనవాసం' అక్టోబర్ 25న విడుదల

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం".

'RRR' లో అజయ్ దేవగణ్ పాత్ర ఇదే ?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,

మాస్ డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీ?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మందు వ‌ల్ల అనారోగ్యానికి గురయ్యాను : శ్రుతి హాస‌న్‌

స్టార్ హీరోయిన్‌గా ఇటు తెలుగు, త‌మిళంతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల్లో న‌టించిన శ్రుతిహాస‌న్ కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. లండ‌న్‌కు చెందిన మైకేల్‌తో ప్రేమాయ‌ణం నెరిపింది.