GodFather: 'గాడ్ ఫాదర్' కు సెన్సార్ సర్టిఫికేట్, అక్టోబర్ 5న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్  'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

'గాడ్ ఫాదర్' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.

గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

More News

'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న కర్నూలులో జరిగే  ప్రీ-రిలీజ్ కి హాజరుకానున్న నాగ చైతన్య, అఖిల్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'

'శాకుంతలం' నవంబర్ 4న విడుదల

ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.

BiggBoss: ‘‘పిట్ట’’ అంటూ కామెంట్.. ఇనయా- శ్రీహాన్‌ల గొడవతో దద్దరిల్లిన హౌస్

కెప్టెన్సీ కంటెండెర్స్ కోసం జరుగుతోన్న అడవిలో ఆట టాస్క్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

Geeta Sakshigaa: ప్రేక్షకులలలో క్యూరియాసిటీతో పాటు హైప్ పెంచిన "గీతా సాక్షిగా" టీజర్

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్,

NTR Health University : పేరు మారిస్తే వైఎస్ స్థాయి పెరగదు.. ఎన్టీఆర్ స్థాయి తగ్గదు : హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూ. ఎన్టీఆర్

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతోంది.