పండుగలాంటి శుభవార్త చెప్పిన ఆర్బీఐ..

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆన్‌లైన్ లావాదేవీలపై పండుగలాంటి శుభవార్త అందించింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లపై ఛార్జీల భారం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ నెఫ్ట్‌కు.. ఆర్జీటీఎస్ సెపరేట్‌గా చార్జ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

త్వరలో శుభవార్తలే.. శుభవార్తలు!
గురువారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి దిగొచ్చింది. కాగా.. ఆర్బీఐ ఇలా వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్థిక నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ ఎంసీపీ సమావేశాల్లోనూ ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారన్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. రేట్ల కోతతో ఇంటి రుణాలు, ఆటో లోన్స్, గోల్డ్ లోన్స్ రుణ రేట్లు దిగొచ్చే అవకాశముందని.. అలాగే డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

More News

సీఎం జగన్‌కు చంద్రబాబు రెక్వెస్ట్.. వైసీపీ నుంచి ఊహించని షాక్!

కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

దేవకి కాదు.. మీరు నా ‘దొరసాని’.. టీజర్ రివ్యూ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక జంట‌గా.. నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కుతున్న టాలీవుడ్ చిత్రం ‘దొరసాని’

టీడీపీని కుదిపేస్తున్న నాని వ్యవహారం.. అసలేం జరుగుతోంది!

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. రోజురోజుకు నాని ఎందుకిలా వ్యవహరిస్తున్నారో..? అసలు నాని మనసులో ఏముందో..?

షాకింగ్ ట్విస్ట్ : వైసీపీ తరఫున రాజ్యసభకు ముద్రగడ!?

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారా..? వైసీపీ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందిందా..?

తోట ఫ్యామిలీకి కీలక పదవి.. హామీ ఇచ్చిన జగన్!

ఇదేంటి.. తోట ఫ్యామిలీ నుంచి ఒకరు వైసీపీ నుంచి.. మరొకరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుగా..?