IPL Schedule 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రెండో విడతలను విదేశాల్లో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ భారత్‌లోనే నిర్వహించేందుకు మొగ్గు చూపింది. టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో విడతలో 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను వెల్లడించింది. మే 26న చెన్నై వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అలాగే మే 24న క్వాలిఫైర్ 2 మ్యాచ్‌ చెన్నైలోనే నిర్వహించనునక్నారు. ఇక మే 21న క్వాలిఫైయర్ 1, మే22న ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.

ఈసారి ఐపీఎల్ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్‌-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతోపాటు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో.. ఒక గ్రూప్‌లోని జట్లు తమ గ్రూపులోని జట్లతో ఒకసారి తలపడితే.. వేరే గ్రూపులోని జట్లతో రెండుసార్లు చొప్పున తలపడతాయి. గ్రూప్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా మార్చి 22 నుంచి మే 26 వరకు దాదాపు 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన హోంగ్రౌండ్‌గా ఉప్పల్‌లో 6 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండో హౌంగ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. దీంతో మార్చి 31, ఏప్రిల్ 3న జరిగే ఢిల్లీ మ్యాచులు వైజాగ్‌లో జరుగుతాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్..

కోల్‌కతా x సన్‌రైజర్స్ - మార్చి 23, కోల్‌కతా
సన్‌రైజర్స్ x ముంబై- మార్చి 27, హైదరాబాద్
గుజరాత్ x సన్‌రైజర్స్ - మార్చి 31, అహ్మదాబాద్
సన్‌రైజర్స్ x చెన్నై - ఏప్రిల్ 5, హైదరాబాద్
పంజాబ్x సన్‌రైజర్స్ - ఏప్రిల్ 9, మొహాలి
ఆర్సీబీ x సన్‌రైజర్స్ - ఏప్రిల్ 15, బెంగళూరు
ఢిల్లీ x సన్‌రైజర్స్ - ఏప్రిల్ 20, ఢిల్లీ
సన్‌రైజర్స్ x ఆర్సీబీ - ఏప్రిల్ 25, హైదరాబాద్
చెన్నై x సన్‌రైజర్స్ - ఏప్రిల్ 28, చెన్నై
సన్‌రైజర్స్ x రాజస్థాన్ - మే 2, హైదరాబాద్
సన్‌రైజర్స్ x లక్నో - మే 8, హైదరాబాద్
సన్‌రైజర్స్ x గుజరాత్ - మే 16, హైదరాబాద్
సన్‌రైజర్స్ x పంజాబ్ - మే 19, హైదరాబాద్

More News

Chandrababu: అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు.

Gali Janardhan Reddy: బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. పార్టీ విలీనం..

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhana Reddy) తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.

Sugunamma: తిరుపతి సీటుపై పునరాలోచించాలి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి..

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా కొంతమంది నేతలకు టికెట్ దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు పొత్తులో టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

RC17: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'రంగస్థలం' కాంబో రిపీట్..

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు.. ఒవైసీపై పోటీ ఎవరంటే..?

పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.