RRR: ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. ఎందుకంటే ఆయ‌న 'RRR' సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తార‌నే సంగ‌తి ఇంత వ‌ర‌కు ఖ‌రారు కాలేదు. బుధ‌వారం ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న'RRR' చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ గురించి చిత్ర యూనిట్ చెబుతూ ఓ మెసేజ్‌ను ట్వీట్‌ను చేసింది. '''RRR' ప్రారంభ‌మై ఏడాది గ‌డిచింది. 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. తార‌క్ స‌ర‌న ఎవ‌రు జోడిగా న‌టిస్తార‌నే విష‌యాన్ని రేపు చెబుతాం. అలాగే ప్ర‌తినాయ‌కులుగా ఎవ‌రు న‌టిస్తార‌ని రేపు చెబుతాం'' అని తెలిపారు చిత్ర యూనిట్‌.

ముందుగా ఎన్టీఆర్ స‌ర‌స‌న డైసీ ఎడ్గార్గ్ జోన్స్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. ఆమె స్థానంలో ఎవ‌రిని తీసుకున్నామ‌నే దానిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వ‌లేదు. సినిమాకు సంబంధించి 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. చారిత్ర‌క పురుషులు అల్లూరి, కొమ‌రం భీమ్ జీవితాల్లో అజ్ఞాతంగా గ‌డిపిన కొన్నాళ్ల‌కు సంబంధించిన కాల్ప‌నిక క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అలియా భ‌ట్ మ‌రో నాయిక‌. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు త‌మిళ న‌టుడు స‌ముద్ర ఖ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తుంది.