close
Choose your channels

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...

Monday, January 25, 2021 • తెలుగు Comments

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులకు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు అందిస్తున్నారు. ఇటీవలే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించిన పవన్.. మరో సినిమాను కూడా నేడు సెట్స్‌పైకి తీసుకొచ్చేశారు. పవన్, రాణా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమైంది. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిరోజు షూటింగ్‌లో పవన్ కల్యాణ్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలకు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర శ్రీకారం చుట్టారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే. అలాగే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. తొలి షెడ్యూల్‌ో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటిలు పాల్గొంటారని.. పదిరోజులపాటు హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz