close
Choose your channels

ఆర్టీసీపై కేసీఆర్ ఆఖరి ప్రకటన.. కార్మికులకు గుడ్ న్యూస్

Friday, November 29, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్టీసీపై కేసీఆర్ ఆఖరి ప్రకటన.. కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆఖరి ప్రకటన చేసేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ అధికారులు, మంత్రులతో సమావేశమైన కేసీఆర్.. కీలక నిర్ణయమే తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కార్మికులకు ఆలస్యమైనా తియ్యటి శుభవార్త చెప్పి.. ఆర్టీసీ సమస్యకు ముగింపు పలికారు. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

రేపే విధుల్లో చేరండి!
‘కార్మికులు అందరూ ఉద్యోగాల్లో చేరండి. రేపు ఉదయమే విధుల్లో చేరండి. ఆర్టీసీకి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం. కార్మికులు విధుల్లో చేరడానికి ఎలాంటి షరతులు లేవు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతాం. కిలోమీటర్‌కు రూ. 20 పైసలు చొప్పున పెంచుతాం. పెంచిన చార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయి’ అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

నేనే స్వయంగా మాట్లాడుతా!
‘వాస్తవానికి మేం అనుకున్న ప్రైవేటీకరణ వేరు.. బయట ప్రచారం చేసింది వేరు. ప్రైవేట్ పర్మిట్లు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇద్దామనుకున్నాం. కార్మికులతో స్వయంగా నేనే మాట్లాడుతాను. వచ్చే వారంలో ప్రతి డిపో నుంచి ఐదుగుర్ని పిలిపించి నేనే మాట్లాడుతాను. సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి నిశితంగా వివరిస్తాను. ఆర్టీసీని ఏం చేయాలో వాళ్లే చెప్పాలి. ఆర్టీఅసీ ఆర్థిక పరిస్థితిని 49 వేల మంది కార్మికులకు తెలియజేస్తాం. యూనియన్ నేతలను మాత్రం రానివ్వం’ అని కేసీఆర్ తేల్చేశారు.

చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!
కాగా.. సమ్మె సమయంలో పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. మరికొందరు హార్ట్ ఎటాక్‌తోనూ చనిపోయారు. ఇంకొందరు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే..‘ చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోమిస్తాం. అయితే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తాం. సంస్థ బతకడానికి కార్మికులే కారణం. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా గుండెల్లో పెట్టుకుంటాం. యూనియన్ల ఉన్మాదంలో పడకండి. నా మాట వింటే కార్మికులకు బోనస్ వస్తుంది. యూనియన్ల మాట వింటే బజారను పడతారు’ అని కేసీఆర్ తేల్చిచెప్పేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.