నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

  • IndiaGlitz, [Monday,October 05 2015]

'మ‌నం' వంటి మెమ‌ర‌బుల్ మూవీ త‌రువాత నాగార్జున హీరోగా న‌టిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయ‌నా'. ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. ఆరంభ‌మైన కొత్త‌ల్లో ఈ సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు లేన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం మాత్రం ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్రేష‌న్స్ నెల‌కొన్నాయి. ఎందుకంటే.. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా' షూటింగ్ టైం నాటికి ఇందులో నాగ్ ప‌క్క‌న న‌టిస్తున్న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్యకృష్ణ కానీ..

అప్ క‌మింగ్ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కానీ సినిమాపై అంత‌గా ఆస‌క్తిని ఆ టైంలో క్రియేట్ చేయ‌లేక‌పోయారు. అయితే ఈ సినిమా ఫినిషింగ్కి చేరుకునే టైంకి అటు 'బాహుబ‌లి'తో ర‌మ్య‌.. ఇటు 'భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌'తో లావ‌ణ్య ఫామ్ లోకి రావ‌డంతో అప్ప‌ట్నుంచీ సినిమాపై క్రేజ్ పెరిగింది. దానికి తోడు ట్రైల‌ర్ కూడా ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో 'సోగ్గాడే..'కి అన్ని శుభ శ‌కున‌ములేగా తోస్తున్నాయి. న‌వంబ‌ర్‌లో కానీ, డిసెంబ‌ర్‌లో కానీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ద్వారా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

More News

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.ఈ సినిమాలో రానా,అల్లు అర్జున్,క్రిష్ణంరాజు,నిత్యామీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

తమన్నా ఏ మాత్రం తగ్గట్టేదు

'బాహుబలి'విజయంతో తమన్నా క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమన్నాని అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ పరంగా బాగానే వాడుకుంటున్నారు

నిన్న గోపీచంద్... నేడు అజిత్..

కెమెరామేన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన 'శౌర్యం'శివ..ప్రస్తుతం తమిళంలో అజిత్ తో 'వేదాళం'అనే సినిమా రూపొందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపై సేవా కార్యక్రమాలకు సగం సమయం కేటాయిస్తా - ఆదిత్యా ఓం

జయాపజయాలకు అతీతంగా నటుడిగా గుర్తించి ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి తనవంతు సేవలందించే లక్ష్యంతో ఇకపై సగం సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్టు నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు.

'సోగ్గాడే చిన్నినాయనా' షూటింగ్ పూర్తి

కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్'సోగ్గాడే చిన్నినాయనా'.