'జీ5' ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్' ట్రైలర్ కు అద్భుత స్పందన

  • IndiaGlitz, [Wednesday,October 20 2021]

అక్టోబర్ 22న నుండి 'జీ 5' ఓటీటీ వేదికలో ప్రీమియర్ కానున్న సినిమా వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'. ఒక్క హిందీలో మాత్రమే కాదు...తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో 'జీ 5' ఉంటే చాలు... వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది 'అమృత రామమ్' నుండి మొదలుపెడితే '47 డేస్', 'మేకా సూరి', 'బట్టల రామస్వామి బయోపిక్కు', ఇటీవల 'నెట్', 'అలాంటి సిత్రాలు' వరకూ ఎన్నో సినిమాలను 'జీ 5' డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ప్రజల కోసం ప్రత్యేకంగా సినిమాలు అందిస్తోంది. ఇటీవల జీ5లో విడుదలైన రాజ రాజ చోర సినిమా ఓటీటీ మాధ్యమంలో బిగ్గెస్ట్ హిట్ సాధించింది. తాజాగా ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్'ను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్'. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి 'జీ 5' ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. ప్రముఖ కథానాయిక రెజీనా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.

'అందరి కథలు ఒకే విధములు... కథనము మారే గతే బ్రతుకులు' అంటూ సునీల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది.

'హెడ్స్ అండ్ టేల్స్'లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. 'గాళ్ ఫార్ములా' యూట్యూబ్ ఛాన‌ల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య-దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు. చాందిని రావు మరో ప్రధాన పాత్రలో నటించారు. కలర్ ఫొటో హీరో సుహాస్ సైతం ట్రైలర్ లో కనిపించారు.

నటి కావాలని కోటి కలలతో హైదరాబాద్ వచ్చిన ఒక అమ్మాయిగా శ్రీవిద్య... పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న అమ్మాయిగా దివ్య శ్రీపాద... సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాందిని రావు నటించారు. సునీల్ భగవంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో కామన్ పాయింట్ ఏంటి? అమ్మాయిలకు వాళ్ల జీవితాల్లో అబ్బాయిల నుండి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు? అనేది సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

'హెడ్స్ అండ్ టేల్స్' గురించి మేకర్స్ మాట్లాడుతూ ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ. ట్రైలర్ కు వచ్చిన స్పందన మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ట్రైలర్ పెంచిన అంచనాలను సినిమా తప్పకుండా అందుకుంటుంది అని చెప్పారు.

దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ ఒక్క రాత్రిలో జరిగే కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది అని అన్నారు.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది అని 'జీ 5' వర్గాలు తెలిపాయి. కలర్ ఫొటో సినిమా రూపొందించిన కోర్ టీమ్ నుండి హెడ్స్ అండ్ టేల్స్ సినిమా రూపొందింది.

More News

నవంబర్ 12న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌' విడుదల

తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

ఎప్పటిలాగానే బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల రచ్చ మళ్లీ మొదలైంది.

మెడలో తాళిబొట్టు.. సురేఖా వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా, పిక్ వైరల్

తెలుగు చిత్ర సీమలో తల్లి, అక్క, వదిన, స్నేహితురాలి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి.

నాపై ఇంత నీచంగానా.. హీరోలు బట్టలు విప్పి, రొమాన్స్ చేస్తే మాట్లాడరే : కోటాకు అనసూయ ఘాటు రిప్లయ్

నటీనటుల మధ్య ఆహ్లాదకరంగా.. ఎంతో ఫ్రెండ్లీగా వుండే వాతావరణం కాస్తా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి.

'లవ్ స్టోరీ’ జోరుకి బ్రేక్ వేసిన వరుణ్ డాక్టర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!!

2019 చివరిలో ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.