నాగచైతన్య హీరోయిన్ టైమ్ బావుంది

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న చిత్రాల‌లో ' ప్రేమ‌మ్' ఒక‌టి. మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన 'ప్రేమ‌మ్' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లు. శ్రుతి కాకుండా మిగిలిన ఇద్ద‌రు నాయిక‌లు ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో తాము చేసిన పాత్ర‌ల‌నే ఇక్క‌డా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూడో హీరోయిన్‌గా న‌టిస్తున్న మ‌డోన్నా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. 'ప్రేమ‌మ్‌'తో తొలి హిట్ కొట్టిన ఈమె ఆ త‌రువాత త‌మిళంలో చేసిన 'కాద‌ల్ క‌డందు పోగుమ్‌'తో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా వ‌చ్చిన మ‌రో మ‌ల‌యాళ చిత్రం 'కింగ్ ల‌య‌ర్‌'తోనూ ఆమె జాబితాలో ఇంకో విజ‌యం చేరింది. ఈ జోరు చూస్తుంటే.. 'ప్రేమ‌మ్' తెలుగు వెర్ష‌న్ కూడా ఆమెకో మెమ‌ర‌బుల్ హిట్ అవుతుందేమో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు.