మిస్ట‌ర్ వార్త‌ల పై రైట‌ర్ కి కోపం వ‌చ్చింది..

  • IndiaGlitz, [Monday,May 30 2016]

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మాత‌. గ‌త నెలాఖ‌రున పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ నెల‌లో స్పెయిన్ లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే...ఏమైందో ఏమో కానీ...అనుకున్న డేట్ కి మిస్ట‌ర్ స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే...వ‌రుణ్ తేజ్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు అంగీక‌రించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు. దీంతో వ‌రుణ్ తేజ్ కి మిస్ట‌ర్ సెకండాఫ్ న‌చ్చ‌లేద‌ని అందుక‌నే ఈ సినిమాను ప‌క్క‌న‌పెట్టి శేఖ‌ర్ క‌మ్ముల‌కు అవ‌కాశం ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

అయితే...మిస్ట‌ర్ పై వ‌స్తున్న వార్త‌ల‌ పై మిస్ట‌ర్ చిత్ర ర‌చ‌యిత గోపీ మోహ‌న్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. సినిమా టీమ్ కాకుండా వెబ్ సైట్స్ కి న్యూస్ ఎవ‌రు ఇస్తారో తెలియ‌డం లేదు. నెగిటివ్ న్యూస్ ని ప్ర‌చారం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ల‌కి అదో స‌ర‌దా. రూమ‌ర్స్ కి కాల‌మే స‌మాధానం చెబుతుంది అంటూ స్పందించారు. ఇదంతా చూస్తుంటే...గోపీమోహ‌న్ కి కోపం వ‌చ్చింది అని అర్ధం అవుతుంది.ఈ విష‌యం పై గోపీమోహ‌న్ ని సంప్ర‌దిస్తే...మిస్ట‌ర్ జూన్ 10న ప్రారంభం అని తెలియ‌చేసారు. మ‌రి...గోపీ చెప్పిన‌ట్టు జూన్ 10న మిస్ట‌ర్ ప్రారంభం అవుతుందని ఆశిద్దాం.

More News

బాహుబలి 2 కోసం మిల్కీబ్యూటీ

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.

తండ్రి బాటలో విష్ణు....

మోహన్ బాబు నటుడిగానే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఏటా వేలాది మంది విద్యార్థులకు చదువును అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’.

ఫ‌స్ట్ టైమ్ సారీ చెప్పిన వ‌ర్మ‌

సంచ‌ల‌నానికి...వివాదానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ...ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ త‌నకు  ఏది అనిపిస్తే...అది దాచుకోకుండా...మ‌న‌సులో మాట‌ల‌ను ట్విట్ట‌ర్ లో పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటారు.

నెల్లూరు లో హీరో సూర్య...

తమిళ హీరో సూర్య నటించిన 24మూవీ ఇటీవల రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే.