close
Choose your channels

స‌హ‌జీవ‌నాన్ని కన్‌ఫర్మ్ చేసిన గోపీసుందర్

Friday, May 15, 2020 • తెలుగు Comments

స‌హ‌జీవ‌నాన్ని కన్‌ఫర్మ్ చేసిన గోపీసుందర్

జాతీయ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ గోపీ సుంద‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఈయ‌న త‌న భార్య ప్రియ నుండి విడిపోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై గోపీసుంద‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను ఓ గాయ‌నితో తొమ్మిదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 2001లో ప్రియ‌ను గోపీసుంద‌ర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులున్నారు. అయితే కొంత‌కాలంగా వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో దంప‌తులిద్ద‌రు విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలో గోపీసుంద‌ర్ యువ గాయ‌ని అభ‌య హిరణ్మ‌యితో ప్రేమ‌లో ప‌డ్డారు. ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. తాను అభ‌య‌తో లివింగ్ రిలేష‌న్ షిప్‌లో ఉన్న‌ట్లు ఓ ఫొటో ద్వారా గోపీసుంద‌ర్ తెలియ‌జేశారు. నా ఉనికికి నువ్వే కార‌ణమంటూ గోపీసుంద‌ర్ అభ‌య‌తో దిగిన ఫొటోను గోపీసుంద‌ర్ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తెలుగులో గోపీ సుంద‌ర్ గీత గోవిందం, మ‌జిలీ స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. ఈ ఏడాది గోపీసుంద‌ర్ సంగీతం అందించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రం విడుద‌ల కాగా ..నిశ్శ‌బ్దం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, 18 పేజీస్ సినిమాలు విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz