'సీటీమార్' లో కబడ్డీ కోచులుగా గోపీచంద్, తమన్నా

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం 'సీటీమార్‌'. జూన్ 20 సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా 'సీటీమార్' చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మించ‌బ‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే...ఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌

మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది. ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

More News

షాకిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. కాస్త ఊరటనిచ్చే అంశమిదే..

జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం మనది.

తెలంగాణ కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

రాష్ట్రాలన్నీ ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్‌మెంట్ విధానంతో ముందుకు సాగుతుంటే.. తెలంగాణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్‌

ప్రపంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు రంగాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.

నిహారిక పెళ్లి పెద్ద మెగాస్టారే.. వరుడి తండ్రి ముందు చిరు ప్రపోజల్..

మెగా వారింట పెళ్లి అనగానే.. వరుడెవరు? వరుడి కుటుంబానికి.. మెగా కుటుంబంతో ఏమైనా సంబంధం ఉందా?

నితిన్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ మేక‌ప్ మ్యాన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.