రేపు గోపీచంద్ ఆక్సిజ‌న్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

గోపీచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆక్సిజ‌న్. ఈ చిత్రాన్ని శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఆక్సిజ‌న్ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో మూడ‌వ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న ఆక్సిజ‌న్ మూవీ ఫ‌స్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేయ‌నున్నారు.

గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న‌ ఆక్సిజ‌న్ స‌క్సెస్ పై టీమ్ న‌మ్మ‌కంతో ఉన్నారు. గోపీచంద్‌, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

More News

ఊపిరి శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన పి.వి.పి

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రం మూడవ వారంలోను విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్ మారింది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.

మ‌హేష్‌తో ఒక‌లా.. తార‌క్‌తో మ‌రోలా..

మునుప‌టిలా వ‌రుస విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకోలేక‌పోతున్న‌ప్ప‌టికీ.. భారీ బ‌డ్జెట్ మూవీ ఆఫ‌ర్ల‌ను పొందుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలంటే.. మ‌హేష్‌బాబుతో న‌టిస్తున్న 'బ్ర‌హ్మోత్స‌వం', ఎన్టీఆర్‌తో న‌టిస్తున్న 'జ‌న‌తాగ్యారేజ్‌'.

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...ఎవరనుకుంటున్నారా..?హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్..

స‌మంతకి త‌మ‌న్నా చెక్ పెట్ట‌నుందా?

ఓ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌నే మ‌హారాణి. మున్ముందు ఆ విష‌యంలో స‌ద‌రు చెన్నై పొన్నుకి చెక్ పెట్టేలా ఉంది త‌మ‌న్నా. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. యుఎస్ లో టాప్ 10 గ్రాస‌ర్స్‌లో గ‌త కొంత కాలంగా హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే క్వీన్‌.