షూటింగ్ పూర్తి చేసుకున్న గోపీచంద్ `చాణక్య`

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ 'చాణక్య'. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మూవీ మేకర్స్ పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More News

సాయిపల్లవి 'అనుకోని అతిధి'

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా  మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్.

షారూక్ పేరుతో స్కాలర్ షిప్‌

మెల్‌బోర్న్‌కి చెందిన లా ట్రోబ్ యూనివ‌ర్సిటీ షారూక్ ఖాన్ పేరుమీద ఓ స్కాల‌ర్ షిప్‌ను అనౌన్స్ చేసింది.

'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

`విరాట ప‌ర్వం 1992` షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

శ్రావణ శుక్రవారాన్ని మన హిందువులు చాలా పవిత్రంగా, విశిష్టమైనరోజుగా భావిస్తుంటారు. ఈరోజున మంచువారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.

66వ జాతీయ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో ఏడు అవార్డులను సాధించడం విశేషం.